తెలంగాణ ఎక్స్ ప్రెస్ 23/01/24
భైంసా మండలం కేంద్రం లో ని నేతాజీ నగర్ లో భరతమాత ముద్దుబిడ్డ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి,శౌర్య దివాస్ వేడుకలను స్థానిక శాసనసభ సభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు..సుభాష్ చంద్రబోస్ కణకణ మండే నిప్పుకణం,భారతజాతి వేకువ కిరణమని అన్నారు.స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన సూర్యుడని,
జయంతే కాని వర్ధంతి లేని అమరుడని, స్వాతంత్య్ర సాధనే జీవిత ధ్యేయంగా తపించిన భరతమాత ముద్దు బిడ్డని ప్రతి ఒక్కరు ఆయన అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ , గల్లి కౌన్సిలర్ గాలి రవి సర్పంచ్ అల్లకొండ సాయినాథ్ పట్టణ అధ్యక్షులు మల్లేష్ మరియు ప్రజా ప్రతినిధులు బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా నేతాజీ చంద్రబోష్ జయంతి
66
previous post