Home తాజా వార్తలు హిందూ వాహిని అధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

హిందూ వాహిని అధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

by Telangana Express

భారత దేశ స్వతంత్రం లో కీలక పాత్ర పోషించిన సుభాష్ చంద్రబోస్ గారి జయంతి నీ పునాస్కరించుకొని స్థానిక మున్సిపల్ ఆఫీస్ దగ్గర ద్వాజవిష్కరణ చేయడం జరిగింది.జిల్లా అధ్యక్షులు సాయి కిరణ్ మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమం లో బోస్ గారు యువతకు ఇచ్చిన నినాదం మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను అని సూచించారు ప్రపంచ దేశాలలో గల భారతీయులను చైతన్య పరచి చెలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా యువతలో కొత్త ఉత్తేజాన్ని పెంపొందించారు అహింస తోటి స్వతంత్రం సాధ్యం కాదని స్వాతంత్య్రం రావాలి అంటే దెబ్బకు దెబ్బే సమాధానం అన్నారు. అజాద్ హింద్ ఫౌజ్ నీ ఏర్పాటు చేశారు. రవి అస్తమించని భారతం లో నూతన ఉషోదయన్ని రేకెత్తించి మరణం లేని మహా వీరునిగా చరిత్ర లో మిగిలి తన జీవిత పరియంతం భారత మాత దాస్య శృంఖలాలు తెంచడం కోసం జీవితాన్ని తృణ ప్రాయంగా తల్లి భారతీ పాదాల దగ్గర సమర్పించిన మహనుభావుడు. నేటి యువత చెడు వ్యసనాలను వదలిపెట్టి దేశ రక్షణ కోసం కంకణం కట్టుకోవాలి రిల్ హీరోలను ఆదర్శంగా తీసుకోవడం కాదు స్వతంత్ర కోసం ప్రాణాలను అర్పించిన రియల్ హీరోలను యువత ఆదర్శం గా తీసుకోవాలని సూచించారు.. ఈ కార్యక్రమం లో నగర అధ్యక్షులు తరుణ్.అభిషేక్.వంశీ. సాయి తేజ తదితర హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

*హిందూ వాహిని – కామారెడ్డి జిల్లా*

You may also like

Leave a Comment