Home తాజా వార్తలు మండలంలో బెల్ట్ షాపులు గుడుంబా అమ్మకాలు నిలిపివేయాలి

మండలంలో బెల్ట్ షాపులు గుడుంబా అమ్మకాలు నిలిపివేయాలి

by Telangana Express

మంచిర్యాల, జనవరి 20, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): జన్నారం పట్టణంలో జరిగిన మండల సర్వ సభ్య సమావేశంలో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ పాల్గొన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులతో జరిగిన మొదటి సర్వసభ్య కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. మండలంలోని గ్రామా వీధులలో బెల్ట్ షాపులు గుడుంబా అమ్మకాలను నిలిపివేయాలని, ఖానాపూర్ ఎమ్మెల్యే, ఎక్సైజ్ అధికారులతో అన్నారు. విచ్చలవిడిగా వెలసిన బెల్ట్ దుకాణాలు వెలిసి పేద ప్రజలకు ప్రభుత్వ ఎంఅర్పి ధర కంటే ఎక్కువ అమ్ముతూ పేద ప్రజలు అనారోగ్య అవడానికి బెల్ట్ షాపులు కారణమవుతున్నాయి. మండలంలోని వైన్స్ దుకాణాల నుంచి ప్రైవేట్ వాహనాలలో మద్యం గ్రామాల, వీధులకు సరఫరా అవుతుంది. మండలంలోని ప్రజలు అనారోగ్యం చెందడానికి బెల్ట్ దుకాణాలు కారణం అవుతున్నాయాని, వాటిని ఎత్తెయ్యాలని, ఎక్సైజ్ ఎస్ఐ భవాని తెలిపారు. అదేవిధంగా జన్నారం మండలంలోని పల్లెలు, వాడలలో గుడుంబా అమ్మకం దారులు తాగే విధంగా మత్తు పానీయాలు కలిపి పేద ప్రజలు అనారోగ్యం చెందడానికి గుడుంబా తయారు, అమ్మకం దారులు కరణమవుతున్నారు. గుడుంబా తాగడానికి బానిసలుగా చేయడానికి మత్తు పదార్థాలు అందులో వేసి గుడుంబా తయారుచేసి అమ్మడం చేత పేద ప్రజలు కుటుంబాలు రోడ్డున పాలు అయ్యే విధంగా గుడుంబా అమ్మకందారులు చేస్తున్నారు. జన్నారం మండలంలోని గ్రామ, వీధులలో వెలసిన బెల్ట్ దుకాణాలను ఎత్తివేయాలని, గుడుంబా రహిత గ్రామాలను తయారు చెయ్యాలని ఎక్సయిస్ ఎస్ఐ భవానికి సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలు ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో బెల్ట్ షాపులు వైన్సులు ఉండకుండా చూడాలని ఎమ్మెల్యే తెలిపారు. జన్నారం మండల సర్వసభ్య సమావేశంలో నవాబ్ తాసిల్దార్ రామ్మోహన్ మండల పట్టణ, గ్రామాలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టం ప్రకారం తగు చర్య తీసుకోవాలని దిగువ ప్రభుత్వ అధికారులకు ఆదేశించారు. జన్నారం మండలంలోని మండల రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, తదితర శాఖల అధికారులతో మరోసారి సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పటేల్ అన్నారు.

You may also like

Leave a Comment