Home తాజా వార్తలు రాజకీయ నాయకుల ఆగడాలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది

రాజకీయ నాయకుల ఆగడాలు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది

by Telangana Express

నా కుటుంబానికి న్యాయం చేయండి అంటూ సూసైడ్ లెటర్ లో బాలచంద్రం ఆవేదన కలకలం రేపింది

స్టేట్ బ్యూరో క్రైమ్ .
తెలంగాణ ఎక్స్ ప్రెస్ జనవరి 20
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం అంబారీపెట్ లో యువకుడు బాల్ చంద్రం ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. తన చావుకు పూర్తి బాధ్యులు గ్రామ సర్పంచ్ మహమ్మద్ సలీం, పుట్ట శ్రీనివాస్, పుట్ట బాల్ నర్సు అని వాట్సప్ లో సూసైడ్ లేఖ రాశాడు. అనంతరం గ్రామ శివారులో ఉరేసుకొని బలవన్మరణం చెందాడు. అంబారీపెట్ గ్రామ పంచాయతీ ముందు మృతుడు బాల్ చంద్రంకు 450 గజాల ఖాళీ స్థలం ఉంది. దాన్ని బీఆర్ఎస్ సర్పంచ్ సలీం కబ్జా చేశాడని, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోలేదని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. రాత్రికిరాత్రి ఎస్సై సుధాకర్ ఆధ్వర్యంలో తన ప్లాట్ కబ్జా చేశారని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్న విని నాధుడే లేకపోయాడు తాను
గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగానే తన భూములు కబ్జా చేసి లాక్కున్నారని పేర్కొన్నాడు. తనకు అన్యాయం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని సీఎం రేవంత్, కి సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులో తన మరణ వాంగ్మూలాన్ని పెట్టడం జరిగింది తనకు అన్యాయం చేసిన వారిని వదలకూడదు అని ప్రస్తుత ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి సూసైడ్ నోట్ వాట్సాప్ గ్రూపులో పంపడం జరిగింది
తన కుటుంబాన్ని ఆదుకోవాలని తన కుటుంబం లో న్యాయం జరిగే విధంగా చూడాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ కోరడం జరిగింది వేచి చూడాలి అధికారులు మృతుని కుటుంబానికి న్యాయం చేస్తారా లేదా

వతుడు రాసిన సూసైడ్ లెటర్

గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, నేను పుట్ట బాల్ చంద్రం s/ వెంకటయ్య అను నేను ఈ రోజు సమయం 12.15 నిం, ఆత్మహత్య చేసుకుంటున్నాను.
నా చావుకు పూర్తి బాధ్యుడు మహమ్మద్ సలీం. అంబారీపేట గ్రామ సర్పంచ్. రెండవ బాధ్యుడు పుట్ట శ్రీనివాస్ s/ లక్ష్మి నర్సయ్య, మరియు పుట్ట బాల్ నర్సు s/ లక్ష్మి నర్సు.
నాకు కొత్త గ్రామ పంచాయతీ ముందు ఒక ఫ్లాట్ వుంది. అది తెరాస సర్పంచ్ సలీం కబ్జా చెయ్యడం జరిగింది. దానికి ఎన్ని సార్లు వురికోసం అది పోని సర్పంచ్ గారు నాది 420 గజాల జాగ పోయింది. పక్కనే మైలి రవి ఇంటి ముందు బండలు వున్నాయి. అక్కడ ఇవ్వు అన్న పట్టించు కొలే. Brs మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకో లేదు. రాత్రికి రాత్రి నేను గత కొన్ని సంవత్సరాలుగా వేసిన కంచెను si సుధాకర్ ఆధ్వర్యంలో లో సలీం పర్యవేక్షణ లో గంప గోవర్ధన్ కనుసన్నల్లో నా ఫ్లాట్ తీసివేయడం జరిగింది. కాబట్టి న చావుకు మోధాటీ కారణం మా ఊరి సర్పంచ్.


రెండో కారణం నాకు కొత్తకుంట వెనకాల,ఫరిధ్పెట్ లింక్ రోడ్ చర్చ్ కి ఆపోజిట్ గా వున్న స్థలం మ నాన స్వంతం. అది కేవలం మ నాన సంపాదించుకుంది. అందులో మా పాలి వాల్లు పుట్ట వాళ్లకు సంబంధం లేదు. అయిన కూడా మమ్మల్ని సాగు చేసుకోకుండా పుట్ట శ్రీనివాస్ s/ లక్ష్మి నర్సయ్య మరియు పుట్ట బాల్ నర్సు s/లక్ష్మి నర్సయ్య వీళ్లు ఇద్దరు నా చావుకి రెండో కారకులు.
సర్పంచ్ సలీం నా ఫ్లాట్ తిస్కోవడనికి కారణం.
1 వూళ్ళో మోర్లు,వీధి లైట్ ల కోసం కొట్లడత
2 స్కూల్ క్రీడ ప్రాంగణ లో వచ్చిన మని కోసం అడిగిన
3 కరోనా , లాక్డౌన్ లో వచ్చిన బిధులకోసం
4 హిందూ దేవాలయ స్థలం సబ్జా కోసం అడిగిన కాబట్టే ఈ రోజు నన్ను ఇలా చేశారు .
మొత్తానికి న చావుకి 4 గురు కారణం .
1 గంప గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే
2 సలీం సర్పచు
3 పుట్ట శ్రీనివాస్ s/ లక్ష్మి నర్సు
4 పుట్ట బాల్ నర్సు s/ లక్ష్మి నర్సు.
అమ్మ, నాన నన్ను క్షేమించండి. మా అమ్మకు మొన్నే కంటి ఆపరేషన్లు జరిగింది. నా భార్య కూడా చాలా చేసింది. నన్ను క్షేమించే . నా కూతురు రేపు నవోదయ ఎగ్జాం రాయాలి. నా కొడుకు అనాధ అవ్తుండు. తలచుకుంటేనే ఎలానో వుంది. కానీ నాకు తప్పట్లేదు
చెల్లెండ్లు మీకు పెట్టే బంగారం పెట్టలే, మన ఆస్తిలో మీరు కూడా బాగం పంచుకోండి. నేను లేను, అమ్మ నాన్నలు వున్నారు. ఇల్లులో వాట వద్దు. శ్రీకర్ గానికి కొంచెం ఎక్కో ఇయ్యూర్రి. తండ్రి లేని కొడుకు. వాడు తిట్టిన నా కూతురు ఇందు తిట్టిన వారి కోసం మీరు వుండంది.చెళ్లెండ్లు పైలం. అమ్మ జాగ్రత్త. బాపు మళ్ళా నీ కడుపుల పుడతనే

ఇట్లు
మీ
బాల్ చంద్రం
శ్రీరామ హోటల్
గౌరవ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ అన్నగారికి మరియు మా ఎమ్మెల్యే రమణ అన్న గారికి తెలియజేయు ఏమనగా. రాజకీయ
పలుకుబడి తో వాల్లు తప్పించుకున్న మీరు వదిలిపెట్టకుండా నా ఫ్యామిలీ కి న్యాయం చెయ్యండి.
నా భార్యను మా అమ్మ నాన్నలను వెరుగావుంచండి.
ఇదే నా మరణ వంగుములం.

You may also like

Leave a Comment