ఉచితంగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి..
యుఫ్ టీవీ సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి
వీణవంక,జనవరి 19( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రానికి చెందిన ముస్లిం, క్రిస్టియన్, ఓసి ,బీసీ , ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులు తెలియజేయునది, తెలంగాణ రాష్ట్ర 2024-25 విద్యా సంవత్సరానికి మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులలో ఇంటర్ ప్రవేశాలకు మరియు 5,6,7,8 తరగతి అడ్మిషన్ కోసం నోటిఫికేషన్ విడుదల జరిగింది.18 నుంచి ఫిబ్రవరి 6 వరకు దరఖాస్తు చివరి తేదీ, కావున అడ్మిషన్ల రిజిస్ట్రేషన్లకు దరఖాస్తు కు ఆధునిక గ్రామ దర్శిని కంప్యూటర్ సెంటర్ లో ఆన్లైన్లో ఉచితంగా అప్లై చేయబడును. ప్రస్తుతం 10 వ తరగతి మరియు 4,5,6,7వ తరగతి, చదువుతున్న విద్యార్థులు గమనించి ఆన్లైన్లో అప్లై చేసుకుని విద్యార్థుల ఉన్నత చదువుల కోసం నాణ్యమైన విద్యను అభ్యసించడానికి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో రాణించడానికి అవకాశం ఉంటుందని, యుఫ్ టి వి సీఈవో పాడి ఉదయ నందన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు.