తక్షణమే విగ్రహం ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలి..
విశ్వకర్మ యూత్ స్టేట్ ప్రెసిడెంట్ ఉదారపు నరసింహ చారి డిమాండ్…
హైదరాబాద్/వీణవంక, జనవరి 19( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ మహానగరంలోని శేర్లింగంపల్లి నియోజకవర్గo పరిధిలోని అల్విన్ కాలనీ డివిజన్, ఎల్లమ్మ బండ వద్ద ఉన్న తెలంగాణ జాతిపిత, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహాన్ని గోవింద్ అనే వ్వక్తి ధ్వంసం చెయ్యడాన్ని విశ్వకర్మ స్టేట్ యూత్ ప్రెసిడెంట్ ఉదరపు నరసింహ చారి, మహిళా అధ్యక్షులు మరియు జిల్లాల విశ్వబ్రాహ్మణ నాయకులు తీవ్రంగా ఖండించారు.ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గొప్ప మేధావి, విద్యావేత్త, రచయిత, మానవతావాది అని , వారు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి తన జీవితాన్ని అర్పించిన మహానీయమూర్తి. ఉద్యమ రూపకల్పన చేసిన సిద్ధాంతకర్త అని,1952 నుండి 2011 లో మరణించే వరకు ఉద్యమం గురించి ఆలోచనలు చేసి ఉద్యమకారులకు సలహాలు అందజేశారు. 1969 లో వచ్చిన తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమకారులకు సలహాలు అందిస్తూ కుడి భుజం లాగా ఉన్నారని, అలాగే తెలంగాణ ఉద్యమం కోసం వారు వివాహం కూడా చేసుకోలేదని,అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించి దాని స్థానంలో కొత్త విగ్రహాన్ని వారం రోజుల్లోగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.