10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేత .
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.
వీణవంక, జనవరి 18( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘంటారావం రిపోర్టర్ పత్తి కొండాల్ రెడ్డి ఇటీవలే పక్షవాతానికి గురై, అనారోగ్యంతోబాధపడుతుండగా, గురువారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయనను పరామర్శించారు. కొండల్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని, పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పాత్రికేయ మిత్రుడు పత్తి కొండల్ రెడ్డి కి అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఆరోగ్యం మెరుగు కావడానికి కావలసిన వైద్యాన్ని అందించడానికి సహాయపడతానని హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి, వైస్ ఎంపీపీ లత శ్రీనివాస్, సర్పంచ్ నీల కుమారస్వామి, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మహేష్, వార్డు సభ్యులు రాజు, సంపత్, మాజీ జెడ్పిటిసి రాజ మల్లయ్య, మాజీ ఎంపిటిసి గెల్లు మల్లయ్య, రెడ్డి రాజుల రవి, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.