Home తాజా వార్తలు ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లో 67 మందికి కంటి పరీక్షలు….11 మందికి మోతి బిందులు గుర్తింపు….కంటి శస్త్ర చికిత్సల కోసం బాన్స్ వాడకు తరలింపు….- ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ వైద్యులు రవీంద్ర మోహన్

ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి లో 67 మందికి కంటి పరీక్షలు….11 మందికి మోతి బిందులు గుర్తింపు….కంటి శస్త్ర చికిత్సల కోసం బాన్స్ వాడకు తరలింపు….- ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ వైద్యులు రవీంద్ర మోహన్

by Telangana Express

ఎల్లారెడ్డి,జనవరి 18,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలోని స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో, గురువారం కామారెడ్డి జిల్లా అంధత్వ నివారణ సంస్థ , బోధన్ లయన్స్ క్లబ్ వారి సంయుక్త అధ్వర్యంలో ఉచిత మోతిబిందు నిర్ధారణ , కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆసుపత్రి ఇంచార్జి సూపరింటెండెంట్ వైద్యులు రవీంద్ర మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి నేత్ర వైద్య సహాయ అధికారి బి.హరికిషన్ రావు కంప్యూటర్ ద్వారా 67 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 11 మందికి మోతి భిందు ఉన్నట్లు గుర్తించి, వీరికి ఐ ఒ ఎల్ (ఇంట్రా ఆక్యులర్ లెన్స్) కంటి ఆపరేషన్ నిమిత్తం బోధన్ లయన్స్ కంటి ఆసుపత్రి వారి బ్రాంచ్ బాన్స్ వాడ కు పంపించినట్లు వైద్యులు తెలిపారు.18 మందికి మెరుగైన కంటి చూపు కోసం కంటి అద్దాలు ప్రిస్క్రైబ్ చేయడం జరిగిందన్నారు. మరో ఇద్దరికి కంటి సమస్యలను గుర్తించి హైద్రాబాద్ సరోజినీ కంటి ఆసుపత్రికి రిఫర్ చేయడం జరిగిందన్నారు. మరికొందరికి చిన్న పాటి సమస్యలు గుర్తించి అవసరమైన మందులను ఇవ్వడం జరిగిందన్నారు. మిగితా వారికి కంటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి, ఏ విటమిన్ మందులను అందజేయడం జరిగిందన్నారు. ప్రతి గురువారం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిభిరం ఉంటుందని, ఈ అవకాశాన్ని మండల పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి సూపరింటెండెంట్. వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులు రవీంద్ర మోహన్, ఆర్ ఎం ఓ డాక్టర్ సంగీత్ కుమార్, కంటి వైద్య సహాయ ఆదికారి బి.హరికిషన్ రావు, ఆసుపత్రి సిబ్బంది బద్రొద్దిన్, ఇఫ్తేకార్, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment