Home తాజా వార్తలు కల్లుగీత వృత్తి దారులు ఎదుర్కుంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రిని కలిసిన చైర్మన్ బాలగొని బాల్ రాజ్ గౌడ్

కల్లుగీత వృత్తి దారులు ఎదుర్కుంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రిని కలిసిన చైర్మన్ బాలగొని బాల్ రాజ్ గౌడ్

by Telangana Express

ఘట్కేసర్,జనవరి 18(తెలంగాణ ఎక్స్ ప్రెస్)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆర్థిక ,విద్యుత్ మంత్రిత్వశాఖ,ని ప్రజా భవన్ తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్ప గుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేయజేసిన తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాల్ రాజ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ యెలికట్టె విజయ్ కుమార్ గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగొని వెంకటేష్ గౌడ్ లు .
ఈ సందర్భంగా వారికి ఈ రాష్ట్రంలో గౌడ కల్లుగీత వృత్తి దారులు ఎదుర్కుంటున్న సమస్యలు,ఆర్ధిక సంక్షేమము కోసం చేయూత ఇవ్వాలని వృత్తి ప్రమాదంలో మరణించిన అంగవైకల్యం చెందిన కుటుంబాలకు ఎక్స్ గ్రేషియ 2 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నాయని వాటిని విడుదల చేయాలని, వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరుతూ వివరించడం జరిగింది.
ఉప ముఖ్యమంత్రి బట్టి స్పందిస్తూ రేపటి బడ్జెట్ లో బీసీలకు, కులవృత్తి దారులకు ప్రత్యేక ప్యాకేజీ 20 వేల కోట్లు కేటాయించి సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు .
మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని
ఇది బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని, ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం అని అందుకే వారి సంక్షేమమే మా ధ్యేయం అన్నారు .

You may also like

Leave a Comment