Home తాజా వార్తలు బల్మూర్ వెంకట్ కి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అభినందనీయం

బల్మూర్ వెంకట్ కి ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం అభినందనీయం

by Telangana Express

ఎన్ ఎస్ య ఐ నాయకులు వీణవంక దిలీప్…

వీణవంక, జనవరి 17( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).

కాంగ్రెస్ పార్టీ ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ కి ఎమ్మెల్సీ టికెట్ ఖరారు చేయడం పట్ల ఎన్ ఎస్ యూ ఐ హుజురాబాద్ నియోజకవర్గ నాయకులు వీణవంక దిలీప్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం అహర్నిశలు పార్టీ కోసం పని చేస్తూ విద్యార్థుల ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తూ విద్యార్థి దశ నుంచి మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకట్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం వలన పార్టీ కొరకు పనిచేస్తున్న నాయకులు కార్యకర్తలు నూతన ఉత్సాహాన్ని ఇచ్చినట్లు అయిందని, అంతేకాకుండా పార్టీ కొరకు పనిచేస్తున్న వారికి ఎప్పటికైనా గుర్తింపు వస్తుందని నమ్మకాన్ని కలిగించిందని హర్షం వ్యక్తం చేశారు.

You may also like

Leave a Comment