Home తెలంగాణ ఈ నెల 22న ఎల్లారెడ్డి రామాలయంలో జరిగే లక్షపుష్పార్చన కార్యక్రమం విజయవంతం కోసం సమిష్టి కృషి

ఈ నెల 22న ఎల్లారెడ్డి రామాలయంలో జరిగే లక్షపుష్పార్చన కార్యక్రమం విజయవంతం కోసం సమిష్టి కృషి

by V.Rajendernath

ఎల్లారెడ్డి, జనవరి 17:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)అయోధ్యలో ఈ నెల 22న బల రాముని విగ్రహ ప్రతిష్టాపన సంధర్బంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి రామాలయంలో జరగనున్న లక్షపుష్పార్చన ప్రత్యేక కార్యక్రమ విజయవంతం కోసం సమిష్టి కృషి చేద్దామని శ్రీ.రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు అన్నారు. బుధవారం రాత్రి రామాలయంలో పట్టణంలోని కుల సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి, 22న జరగబోయే కార్యక్రమాల గురించి చర్చించారు. సభ్యులు మాట్లాడుతూ, లక్షపుష్పార్చన, జ్యోతక్క ప్రవచనం, అన్నదానం ఉంటుందన్నారు. ప్రతి కార్యకర్త తెల్ల డ్రస్సులో చెప్పులు లేకుండా హాజరు కావాలని కోరారు. జిల్లాలోనే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ.రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు భజరంగ్ దల్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, కుల సంఘాల అధ్యక్ష , కార్యదర్శులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment