Home తాజా వార్తలు బిల్ల బాగులుకు నివాళులు

బిల్ల బాగులుకు నివాళులు

by Telangana Express

బీబీపేట్ జనవరి 16 ( తే
తెలంగాణ ఎక్స్ ప్రెస్ ) ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు, అమరుడు బిల్ల బాగులు రెండవ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ శ్రామిక భవన్, కోటగల్లీలో నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ బిల్ల బాగులు నందిపేట మండలంలోని ఐలాపూర్ గ్రామం పేద మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడన్నారు. పదవ తరగతి వరకు చదివి, బీడీ వర్కర్ గా పనిచేస్తున్న సమయంలో యూనియన్ లో చేరి యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎదిగాడన్నారు. సుదీర్ఘకాలం యూనియన్ లో క్రియాశీలంగా పనిచేస్తూ 2002లో అనారోగ్యంతో మరణించాడన్నారు. బిల్ల బాగులు మినీ సిగరెట్ల వ్యతిరేక ఉద్యమం, తప్పుడు బాల కార్మికుల రిపోర్టుకు వ్యతిరేకంగా, బీడీ కట్టమీద పుర్రె బొమ్మలకు వ్యతిరేకంగా, ఆకు, తంబాకు, ఉత్పత్తి పెంపుదలకు, పని దినాల పెంపుదలకు, పీఎఫ్ అమలు కోసం యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించాడన్నారు. దోపిడీ పీడనలేని శ్రామికరాజ్యం రావాలని, జీవితాంతం పోరాడిన బిల్ల బాగులు ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.నరేందర్, యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.రాజేశ్వర్, ఎం.వెంకన్న, ఐ ఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి.మల్లేష్, జిల్లా సహాయ కార్యదర్శి డి.కిషన్, ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు పి.సాయరెడ్డి, బి.మురళి, పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి కే.గణేష్, యూనియన్ నాయకులు జీ. గంగాధర్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment