Home తాజా వార్తలు ఎల్లారెడ్డి లో ఘనంగా కుమ్మరి వాము (బట్టి) నోము….కుమ్మరి దంపతులకు నూతన వస్త్రాలు…పూస్తే మట్టెలు ఓడిబియ్యం సమర్పణ

ఎల్లారెడ్డి లో ఘనంగా కుమ్మరి వాము (బట్టి) నోము….కుమ్మరి దంపతులకు నూతన వస్త్రాలు…పూస్తే మట్టెలు ఓడిబియ్యం సమర్పణ

by Telangana Express

ఎల్లారెడ్డి, జనవరి 16,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

ఎల్లారెడ్డి పట్టణంలో సంక్రాంతి పండగ పర్వదినాన్ని పురస్కరించుకొని , సోమవారం నాడు బ్రాహ్మణ సమాజం వారు కుమ్మరి వారి వాము ( బట్టి ) నోము (పూజ) ను 11 బ్రాహ్మణ జంటలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు చంద్ర శేఖర్ శాస్త్రి, ప్రణయ్ జ్యోషి పంతులు, మోహన్ జ్యోషి పంతులు సన్నాయి మేలతాళాలతో మంగళ హారతులతో ఊరేగింపుగా టీచర్స్ కాలని చివరలో గల కుమ్మరి వారి బట్టి వరకు చేరుకుని అక్కడ లక్ష్మి నారాయణులకు ఆవాహనం చేసి, కళ్యాణం నిర్వహించారు. ఆతర్వాత సనాతన హిందూ సంప్రదాయాల్లో భాగమైన ఇట్టి పండగ యొక్క విశిష్టత గురించి స్థానిక వేద పండితులు ప్రణయ్ జ్యోషి పంతులు వివరిస్తూ… మనిషి అనాగరిక వ్యవస్థ నుండి నాకరిక సమాజం వైపు మారే క్రమంలో చేతి వృత్తుల వారి పాత్ర ఎంతో గొప్పదని తెలిపారు. అట్టి చేతివృత్తుల వారిచే వస్తువుల తయారు చెయ్యడం కొరకు ఉపయోగించే వ్యవస్థలను ( పనిముట్లు , బట్టి) సంక్రాంతి పర్వదినం నాడు భక్తి శ్రద్ధలతో పూజించడం కోవడం మన సనాత ధర్మంలో ఉందని భక్తులకు వివరించారు. పూజా కార్యక్రమాలు పూర్తి అయిన పిదప, కుమ్మర్లకు కొత్త బట్టలు పుస్తె మట్టెలు పెట్టి ఓడి బియ్యం సమర్పించి సత్కరించారు. ఇలాంటి పూజా కార్యక్రమాల ద్వారా కనుమరుగవుతున్న మన సంప్రదాయాలను పరిచయం చేసిన బ్రాహ్మణ సమాజానికి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లారెడ్డి మండల కుమ్మర సంఘం అధ్యక్షులు కుమ్మరి పండరి మాట్లాడుతూ… ఆధునిక యంత్రాల రాకతో సమాజంలో కనుమరుగై పోతున్నటువంటి కుమ్మర్ల కులవృత్తిని గుర్తించి, మా వృత్తికి ఆరాధ్యమైనటువంటి కుమ్మరి వామును నోము ( పూజించడం ) కోవడంతో పాటు మా కుమ్మర్లలకు బట్టలు పెట్టి, తాళిబొట్టు అందించి కళ్యాణం మహోత్సవం లాగా, సంక్రాంతి పర్వదిన నాడు మమ్మల్ని ఇంతగా గౌరవించిన బ్రాహ్మణ సమాజానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఎల్లారెడ్డి మండల కుమ్మర్ల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కుటుంబాల సువాసినీలు, కాలని మహిళలకు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You may also like

Leave a Comment