Home తాజా వార్తలు ఘనంగా మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్ పుట్టినరోజు వేడుకలు

by Telangana Express

ఆస్పత్రిలో మీల్స్ అండ్ వీల్స్..

మిర్యాలగూడ జనవరి 14 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, లయన్స్ క్లబ్ మిర్యాలగూడ అధ్యక్షులు కర్నాటి రమేష్ పుట్టినరోజు వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. తోలుతగా కర్నాటి రమేష్ నివాసంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించగా అనంతరం మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి లో రోగుల వెంట వచ్చే సహాయకులకు మీల్స్ అండ్ వీల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ప్రోగ్రాం చైర్మన్ మాశెట్టి శ్రీనివాస్ (డైమండ్) ఆధ్వర్యంలో కర్నాటి రమేష్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు కేక్ కట్ చేసి మిఠాయిలను పంపిణీ చేశారు.

అనంతరం మిర్యాలగూడ మండలంలోని గూడూరులో గల శ్రీ రామకృష్ణ రైస్ ఇండస్ట్రీస్ లో రైస్ మిల్ స్టాఫ్ సిబ్బందితో పుట్టినరోజు వేడుకలు జరిపినారు. కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు.

కర్నాటి రమేష్ పుట్టినరోజు పురస్కరించుకొని మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు డాక్టర్ బండారు కుశలయ్య, మిర్యాలగూడ అధ్యక్ష కార్యదర్శులు గౌరు శ్రీనివాస్, వెంకటరమణ చౌదరి, రేపాల మధుసూదన్, రేపాల అంతయ్య పలువురు మిల్లర్స్ లయన్స్ క్లబ్ లీడర్స్, డాక్టర్ జాడీ రాజు, రిలయన్స్ క్లబ్ సిజెఎస్ఎస్ దివ్యాంగ అధ్యక్షులు కోల సైదులు ముదిరాజ్, బి. ఎం. నాయుడు తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు.

You may also like

Leave a Comment