వీణవంక, జనవరి 13( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు
గ్రామానికి శనివారం అయోధ్య నుండి శ్రీరాముని అక్షింతలు రావడం జరిగింది.పెట్రోల్ బ్యాంక్ నుండి వేణుగోపాల స్వామి దేవాలయం వరకు పార్టీలకు అతీతంగా డీజే పాటలతో,మంగళహారులతో మహిళలు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు.అనంతరం భక్తులు మాట్లాడుతూ… అఖండ భారత అవని ఎన్నో ఏళ్లుగా హిందువులంతా మహా యజ్ఞంగాభావించే,అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం చేపట్టిన నాటినుండి కండ్లు కాసేలాగా ఎదురుచూస్తున్న భారతదేశ హిందూ పౌరులకు అఖండ జగతిలో జనవరి 22న శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ట కాబోతున్నాడని సంతోషిస్తూ, అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఇంటింటికి పంపీయడం ప్రజలు సంతోషంగా ఉన్నారు.

భారతదేశంలో ప్రజలంతా సుభిక్షంగా,ఆయురారోగ్యాలతో,సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతారని,మన గ్రామ వాసుల మందిరం శ్రీరాముని ప్రాణ ప్రతిష్టకు ముందు జనవరి 20 నుండి జనవరి 24వ తేదీ వరకు ప్రతి ఒక్కరి గృహంలో ఐదు రోజులు 5 దీపాలు వెలిగించాలని,శ్రీరామ మందిరంతో దేశం సుభిక్షంగా వర్ధిల్లుతుందని, శ్రీరామ జపం చేస్తూ,నిత్యం శ్రీరాముని స్మరించుకోవాలని, గ్రామ ప్రజలను కోరారు.