కోరుట్ల, జనవరి 13(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
కోరుట్ల పట్టణంలోని ముక్క కన్వెన్షన్ ఫంక్షన్ హాల్‌ను మున్సిపల్ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. ఫంక్షన్ హాల్ పర్మిషన్ కోసం మూడు క్రీస్తు ఫిజు రూపంలో తీసుకోని, మూడవ కిస్తు ఫిజు ఫంక్షన్ హాల్ యాజమాన్యం చెల్లించవలసి ఉన్నాయినీ మున్సిపల్ అధికారులు పలు సార్లు నోటీసు ఇచ్చారు, కానీ ఫంక్షన్ హాల్ యాజమాన్యం మూడవ కిస్తు ఫిజు సంబంధించిన బకాయిలు చెల్లించనందుకు ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేసినట్లు కమీషనర్ రాజేశ్వర్ తెలిపారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ బకాయిల చెల్లింపు నిమిత్తం యాజమాన్యానికి పలు మార్లు నోటీసులు పంపినా స్పందించలేదని అన్నారు. పట్టణ ప్రజలు సకాలంలో మున్సిపల్ బకాయిలు చెల్లించాలని కోరారు.