నిజాంసాగర్ జనవరి12,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):
నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామ శివారులోని మహిషాసురమ్మ ఆలయం వద్ద శుక్రవారం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు పండుగ నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేస్తూ పండుగ చేశారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేకు గొంగడితో ఘనంగా సత్కరించారు. అలాగే ఎమ్మెల్యేకు గ్రామ కాంగ్రెస్ నాయకులు వీరారెడ్డి, రామలింగం, సంపత్ రెడ్డి, మహిళలు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, పిట్లం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లికార్జున్,కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణాపురం ప్రతాప్ రెడ్డి,బంజబషప్ప, లక్ష్మారెడ్డి, కిష్టారెడ్డి,ఆకాష్, లోక్య నాయక్,సవాయిసింగ్, రామలింగం,వీరారెడ్డి,జగన్,సంపత్ రెడ్డి, సాయిలు,మండల మహిళా కాంగ్రెస్ నాయకులు తాటిపల్లి సరస్వతి దేవి తదితరులు పాల్గొన్నారు.