- ఎంపీడీవో నరేష్
జుక్కల్ జనవరి 5:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన అభయ హస్తం కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జుక్కల్ ఎంపీడీవో నరేష్ అన్నారు
శుక్రవారం నాడు పడంపల్లి గ్రామపంచాయతీలలో స్థానిక సర్పంచ్ గణేష్ పటేల్ మాజీ సర్పంచ్ రమేష్ ఉప సర్పంచ్ లక్ష్మణ్ నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా వివిధ ఐదు సంక్షేమ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ప్రభుత్వం ఒకే ఫామ్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తుందని అన్నారు. ప్రజలందరూ తమకు అవసరమున్నటువంటి పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తో పాటు సెక్రెటరీ భరత్ సతీష్ అశోక్ ఏ ఈ ఓ సులోచన నెంబర్ గజానంద్ పరు భూ పటేల్ బాలాజీ విట్టల్ ఎల్ బస్వంత్ కె శివరాజ్ అంగన్వాడి టీచర్ లక్ష్మీబాయి ఆశా వర్కర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
