డీజిల్ కోసం బారులు తీరిన ట్రాక్టర్ యజమానులు ..
వీణవంక, జనవరి 2( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
భారతదేశంలో ట్రక్ డ్రైవర్ల పై కొత్త చట్టం తీసుకువచ్చిన కేంద్రంపై వ్యతిరేకతతో ట్రక్ డ్రైవర్లు దేశవ్యాప్తంగా నిరసన చేపట్టడంతో , ఆయిల్ ట్రక్కులు దేశవ్యాప్తంగా ఎక్కడికి ఎక్కడ నిలిచిపోయాయి. దీనివల్ల రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. దేశంలో రవాణా వ్యవస్థ ఎక్కువగా ట్రక్కులు,లారీలతో నడుస్తుంది. అందులో ఎక్కువగా ఆయిల్ సరఫరా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలంటే, ట్రక్ డ్రైవర్లు నిరంతర శ్రమ చేయాల్సిందే, కానీ ప్రభుత్వం తీసుకువచ్చిన నిబంధన ప్రకారం, ఒక డ్రైవర్ అనుకోకుండా ప్రమాదం చేసిన, కావాల్సి చేసినట్లేనని, ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారని, చట్టాన్ని తీసుకురావడానికి వ్యతిరేకిస్తూ, దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. నిరసనలు చేపడంతో తెలంగాణ రాష్ట్రం అంతట ఉదయం నుండి పెట్రోల్ బంకులలో పెట్రోలు, డీజిల్ కోసం వాహనదారులు క్యూ లైన్లు కట్టి, గంటల తరబడి బార్లు తీరారు. ఆయిల్ ట్రక్కు డ్రైవర్లు సమ్మె విరమించే వరకు వ్యవసాయ పనులు ఆగుతాయని ఉద్దేశంతో ట్రాక్టర్ యజమానులు ముందస్తుగా ,
వీణవంక మండల కేంద్రంలో రెండు పెట్రోల్ బంకులు ఉండగా మధ్యాహ్నం నుండి వార్త తెలుసుకున్న ట్రాక్టర్ యజమానులు డీజిల్ కోసం క్యూలైన్లులో నిలబడి కొనుగోలు చేస్తున్నారు. ఒకవైపు పెట్రోల్ కోసం ద్విచక్ర వాహనదారులు, కార్లు క్యూలైన్ కడుతూ, తమ వాహనాల్లో పెట్రోల్ పోయించుకుంటున్నారు. వాహనదారులు మాట్లాడుతూ… కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి చట్టాన్ని ఒకేసారిగా మర్చి ప్రవేశపెట్టడంతో, ట్రక్కు డ్రైవర్లు దేశవ్యాప్తంగా అయోమయానికి గురవుతున్నారని,కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను ఆలోచించి, ట్రక్ డ్రైవర్ల సమ్మె విరమించేందుకు చర్చలు జరపాలని, లేదంటే దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశం ఉందని అంటున్నారు.
