ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో… ప్రభుత్వ పనులు..
బలవుతున్న పై స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు…
వీణవంక, జనవరి 2 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని వీణవంక మండల తహసిల్దార్ కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల ఆధీనంలో ఆఫీసులో ఇష్ట రాజ్యాంగ భేరసారాలు, ధరణి రిజిస్ట్రేషన్ మొదలుకొని, సాధారణమైన క్యాస్ట్, ఇన్కం వరకు కూడా పైసా ఇబ్బందే ఫైలు కదలదు.. అంతేకాక ఆఫీసులో పని చేసే ఉద్యోగులు సాధారణ జనం పై చీత్కరింపులు, బెదిరింపులు, రేపు రాపో,ఎల్లుండి రాపో, అని సమాధానాలు ఎన్నోసార్లు ఎదురైనా , సామాన్య జనం పని కావాలని ఉద్దేశంతో, సార్, సార్ అంటూ తిరిగారు, తప్ప, ఏనాడు ఎవరిని నిందించలేని వీణవంక మండల జనం ఎంత గొప్పవారు అధికారులే గ్రహించాలి. తహసిల్దార్ కార్యాలయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం సరిగా లేక, పలుసార్లు ప్రజల్లో ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చాలాసార్లు అనేక సమస్యలపై జిల్లాస్థాయి, డివిజన్ స్థాయి అధికారులకు ఎన్నో ఫిర్యాదు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల కాలంలో ధరణి ఆపరేటర్ పై ఓ గ్రామానికి చెందిన యువ నాయకుడు తన తండ్రి దగ్గర లంచం తీసుకున్నాడని స్వయంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ఫలితం కనిపించలేదు. అంటే వీణవంక మండల కార్యాలయంలో లంచం అనేది ఎంత రేంజ్ లో జరుగుతుందో ప్రతి అధికారికి మండల ప్రజలు చెప్పనక్కర్లేదు. అతనిని ఇంతవరకు కూడా సస్పెండ్ చేయలేదు. అంతేకాక బేతిగల్ గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ను, తహసిల్దార్ కు తెలియకుండా నాయబ్ తహసిల్దార్, ధరణి ఆపరేటర్లు ఇరువురి కలిసి, తహసిల్దార్ డిజిటల్ కీ తో సర్టిఫికెట్ జారీ చేయడంపై , డిసెంబర్ 30న వీణవంక పోలీసులకు , జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు ఫిర్యాదు చేయడం జరిగింది.కానీ, కార్యాలయంలోనే తోటి అధికారులు మోసం చేయడం జరుగుతుందంటే, సామాన్యుని ఎలా మోసం చేస్తారో ఊహించుకోండి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ ముఖ్యమంత్రి పరిపాలన ఉన్నప్పుడు రాష్ట్రంలోని రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ, విఆర్వోలను తొలగిస్తే, ఇలాంటి అధికారులు మాత్రం నిత్యం అమ్యమ్యాలకు అలవాటు పడి, కాంట్రాక్ట్ ఉద్యోగులతో జత కలిసి, అక్రమ పనులు చేస్తూ, ఉన్నతాధికారులను బదనాం చేస్తూ, ఉద్యోగుల నైతిక విలువలను తుంగలో తొక్కుతున్నారు. ఇకనైనావీణవంక తహసిల్దార్ కార్యాలయంలోపారదర్శకమైన
పాలనతో సామాన్యుడు సైతం, సలాం కొట్టే స్థాయికి ప్రతి ఉద్యోగి రావాలని ప్రతి ఒక్క మండల పౌరుడు ఎదురుచూస్తున్నారు.