Home తాజా వార్తలు గతుకు రోడ్లపై గమ్యం… ప్రమాదం అంచున ప్రయాణం.. గమ్యం చేరడమే గగనం

గతుకు రోడ్లపై గమ్యం… ప్రమాదం అంచున ప్రయాణం.. గమ్యం చేరడమే గగనం

by Telangana Express

ఏళ్లు మారిన పరిపాలన మారదా ?

పాలకులు మారిన రోడ్లు మారవా ?

తీవ్ర నిరాశలో ప్రయాణికులు..

వీణవంక, జనవరి 1 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).

కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం నుండి నర్సింగాపూర్ గ్రామం వరకు నాలుగు రోడ్డుల విస్తరణ పనులు నత్తనడక సాగగా, మండల ప్రజలు గతుకు రోడ్లపై గమ్యాన్ని చేరడం గగనంగా మారింది అంటూ, ప్రయాణం అంటే సరదాగా,సంతోషంగా చేయాల్సింది కానీ, ఈ రెండు కిలోమీటర్ల రోడ్డు మాత్రం గతుకులతో ఉయ్యాల, జంపాల ఊపుతూ, చివరికి ప్రమాద అంచులను చవి చూపిస్తుందని, 10 కిలోమీటర్లు ప్రయాణించింది. ఓకే ఎత్తు అయితే, రెండు కిలోమీటర్లు ప్రయాణం అంటే ఊహించుకోడానికే నరకం కనిపిస్తుందని, 2024 వ సంవత్సరం వచ్చినప్పటికీ , నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమై, మూడేళ్లు గడుస్తున్న పాలకులు మారిన, ప్రభుత్వాలు మారిన, పరిపాలన మాత్రం అంతంత మాత్రంగానే కానవస్తుంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో..?, పాలకుల వైఫల్యమో…?, ప్రభుత్వాల పక్షపాతమో…?,కానీ, జీవన పోరాటంలో ప్రతి ఒక్కరూ ఉదయం లేచి, గడప గడవటానికి గమ్యాన్ని చేరడానికి ఉరుకుల, పరుగుల, జీవన విధానంలో శ్రమజీవులు, కష్టజీవులు, వ్యాపారస్తులు, నిరుపేదలు, అధికారులు, నాయకులు నిత్యం రవాణా మార్గం వెంటే వాహనాలైన బస్ , బైక్, సైకిల్, ఆటో, కార్, ట్రాలీ, లారీ, స్కూటీ ల సహాయంతో వెళ్లి, రాకపోకలు చేయక తప్పదు. కానీ, గతుకుల రోడ్డులో గమ్యం వేటలో కాస్త వేగం పెంచితే.. అదుపు తప్పితే మాత్రం జీవితం అధోగతే.. ప్రమాదం అంచున ప్రయాణం.. జీవితానికి ప్రశ్నార్థకంగా మారుతుందా..? అనే ఆలోచన సామాన్యుని ప్రశ్నిస్తున్న ప్రశ్న..?, ఈనాటి కంప్యూటర్ కంటే వేగవంతమైన జీవన ప్రపంచంలో ఎక్కువగా వాహనాలు నడిపే వారు యువకులే.. అంతేకాక స్పీడ్ గా నడిపేవారు కూడా యువకులే.. ఎందుకంటే గమ్యాన్ని తొందరగా చేరాలనే ఆలోచనతో స్పీడ్ గా వెళ్తే, దురదుష్టవశత్తు బైక్ స్పీడ్ గా వెళ్లి స్కిడ్ అయి పడిపోతే అనుకోకుండా భారీ ప్రమాదం జరిగితే, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే, ఆ కుటుంబం వంశోద్ధారకున్ని కోల్పోతుంది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. దయచేసి అధికారులు, పాలకులు వీణవంక నుండి నర్సింగాపూర్ గ్రామం వరకు యుద్ధ ప్రతిపాదికన నాలుగు రోడ్ల విస్తరణ పనులు వేగంగా పూర్తి చేసి, ప్రయాణికుల, మండలవాసుల, వాహనదారుల బాధలను అర్థం చేసుకోవాలని వేడుకుంటున్నారు.

You may also like

Leave a Comment