మిర్యాలగూడ జనవరి 1 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
వారంతా పూర్వ స్నేహితులు..విడిపోయి మూడు పదాల సంవత్సరాలు అవుతుంది. నూతన సంవత్సర వేడుకలు వారిని కలిపేలా చేసింది. అనుకోకుండా వారిలో ఒక మిత్రుడు పాత మిత్రులము కలుద్దామని చెప్పాడు. చెప్పిందే తడవుగా వారి గ్రూపులో పెట్టడం అపై వెంటనే కలుసుకోవడం జరిగింది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం వారిలో ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. అనంతరము 2024 నూతన సంవత్సర కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు. ఇది మిర్యాలగూడ లోని మేథా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కేంద్రంలో సోమవారంజరిగింది.అనంతరం ఈనెల 7న మిర్యాలగూడలోని కేఎన్ఏం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయనున్న 1994-97 సంవత్సర డిగ్రీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం గురించి చర్చించారు. ఆనాటి విద్యార్ధులు అందరూ కార్యక్రమంలో పాల్గోని అధ్యాపక బృందానికి సన్మానం చేయాలనినిర్ణయించారు.కార్యక్రమంలో స్నేహితులు బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాలోత్ దశరథ్ నాయక్, శ్రీను, రాంప్రసాద్, సాంబశివ,అరవింద్,సైదులు,బాలాజీ, వెంకన్న,కొట్య నాయక్, హరి,తదితరులు పాల్గొన్నారు.
27 సంవత్సరాల స్నేహా బంధం : కలిపిన నూతన సంవత్సరం..2024
103