Home తాజా వార్తలు ఇందిరమ్మ కాలనీలో..మస్తాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

ఇందిరమ్మ కాలనీలో..మస్తాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్

by Telangana Express

మిర్యాలగూడ జనవరి 1 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మిర్యాలగూడ పట్టణంలోని 6వ వార్డ్ ఇందిరమ్మ కాలనీ నందు నూతనంగా ఏర్పాటు చేసిన షేక్ మస్తాన్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను సోమవారం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ నిరంతరం అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నూకల వేణుగోపాల్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు తమ్మడ బోయిన అర్జున్, జనయేత్రీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వైద్యరత్న అవార్డు గ్రహీత డాక్టర్ మునీర్, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నిర్వాహకులు మస్తాన్, ఫస్ట్ ఎయిడ్ వైద్యులు, మస్తాన్, కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కాలనీ వాసులు, బిఎల్ఆర్ బ్రదర్స్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment