మిర్యాలగూడ డిసెంబర్ 26 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఇటీవల వివాహం చేసుకున్న నూతన జంట కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు దీరావత్ స్కైలాబ్ నాయక్ దంపతులను మాజీ హోం మంత్రి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి ఆశీర్వదించారు.మంగళవారం మాజీ ఎమ్మెల్యే దీరావత్ రాగ్యానాయక్ ఇంటికి వచ్చిన జానారెడ్డి నూతన జంటను అభినందించి నూరేళ్ళు సుఖాసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమలో మాజీ శాసన మండలి చీఫ్ వీఫ్ ధీరావత్ భారతీ రాగ్యా నాయక్ ,డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్, బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోతు దశరథ నాయక్, పిసిసి మాజీ సభ్యులు రామలింగయ్య యాదవ్, మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాయం ఉపేందర్ రెడ్డి, రవి తేజ,అశోక్,దేవ్ సింగ్,సందీప్ తదితరులు పాల్గొన్నారు.