Home తాజా వార్తలు రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ప్రగతి కాలేజీ విద్యార్థి మరి.సదాశివకు గోల్డ్ మెడల్

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ప్రగతి కాలేజీ విద్యార్థి మరి.సదాశివకు గోల్డ్ మెడల్

by Telangana Express

మిర్యాలగూడ డిసెంబర్ 26 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) వికారాబాద్ జిల్లా తాండూర్ లో ఈ నెల 21 నుంచి 23 వరకు జరిగిన 67 వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో నల్గొండ పట్టణం ప్రగతి కాలేజీ విద్యార్థి మరి.సదాశివ గోల్డ్ మెడల్ సాధించడం పట్ల కాలేజ్ ప్రిన్సిపాల్ చందం శ్రీనివాసు హర్షం వ్యక్తం చేశారు. కాలేజ్ చైర్మన్ చందం కృష్ణమూర్తి,డైరెక్టర్లు శ్రీనివాసు,నరేంద్ర బాబు,శశిధర్ రావు, రమేష్ రెడ్డి ఇంచార్జి తిరుపత్తయ్య అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా కాలేజీ చైర్మన్, ప్రిన్సిపాల్ ప్రత్యేకంగా కోచ్ అంబటి ప్రణీత్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోచ్ ప్రణీత్ మాట్లాడుతూ ఈనెల 30 నుండి 5 జనవరి 2024 వరకు జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు మరి.సదాశివ ఎంపీ కావడం జరిగిందని తెలిపారు.

You may also like

Leave a Comment