Home తాజా వార్తలు ఘనంగా సిపిఐ,’ 99′ వ, ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా సిపిఐ,’ 99′ వ, ఆవిర్భావ దినోత్సవం

by Telangana Express

చిగురుమామిడి డిసెంబర్ 26 ( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం, రేకొండ గ్రామంలో
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ బోయిని అశోక్ ఆధ్వర్యంలో సిపిఐ 99 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1917లో రష్యా విప్లవం విజయవంతమైన అక్టోబర్ సోషలిస్టు మహా విప్లవం ప్రభావంతో 1925 డిసెంబర్ 26 న కాన్పూర్ నగరంలో సిపిఐ ఆవిర్భవించింది. భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ రైతులు, బడుగు బలహీన వర్గాలు మహిళలను కార్మికులను మధ్యతరగతి ప్రజానికం కోసం మహోజ్వాల పోరాటాలు చేసిన చరిత్ర సిపిఐ పార్టీది అని అన్నారు. దున్నేవానికి భూమి నినాదంతో తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది అశువులు భాషరు, 10 లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిన చరిత్ర సిపిఐ పార్టీదని అన్నారు. దేశ సమగ్రత కోసం, మా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలు కానివ్వమంటూ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఉగ్రమూ కలకు అడ్డుగా నిలిచింది సిపిఐ, చట్టసభల్లో సీట్లు ఓట్లు ఉన్నా లేకపోయినా శ్రామిక జనావాలి కోసం నిరంతరం పోరాడుతుందని అయిన అన్నారు. ఈ కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్ చాడ శ్రీధర్ రెడ్డి, సీపీఐ గ్రామ కార్యదర్శి వాల్లా భాయ్ పటేల్ పరకాల కొండయ్య, తమ్మిశెట్టి రవీందర్, విలాసగరం అంజయ్య, మొగిలి ఓదెలు, రాచర్ల రంగయ్య, బోయిని రాజు, దుడ్డల శంకరయ్య, బోయిన సంజీవ్, నెల్లి మొగిలి, తీగల చంద్రమౌళి ,అందే సతీష్, చంచల రవి, కొత్త పెళ్లి పరశురాములు, పర్కాల వెంకటేశం, మొగిలి బొందయ్య, బక్క దట్ల కనుకయ్య, దుడ్డేల రాజయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment