ఎల్లారెడ్డి, డిసెంబర్ 19,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీ శ్రీ శ్రీ ధర్మ శాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో, సోమవారం అయ్యప్ప స్వామి సామూహిక మండల మహా పడి పూజ అయ్యప్ప సేవా సమితి కమిటీ వారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలో గణపతి హోమం ను ఆలయ పూజారి ముత్యాల శ్రీనివాస్ రావు పంతులు వేద పండితులు నర్సింహ శర్మ , సాయి శర్మ పంతుల్లు మంత్రోచ్చారణ తో శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం స్వాములకు భిక్ష ఏర్పాటు చేశారు. అనంతరం సాయంత్రం 8 గంటలకు మహా పడి పూజ కార్యక్రమం ను ఆలయ పూజారి శ్రీనివాస్ రావు, వేద పండితులతో కలిసి శాస్త్రోక్తంగా నవ విధ అభిషేకాలు, పుష్పార్చన , భజన , కలశ పూజ , అనంతరం పదునెట్టం బడి ని పూలతో అలంకరించి, మెట్ల పూజను నిర్వహించారు. వేలంలో పడి పూజను దక్కించుకున్న సంగా గౌడ్ గురు స్వామి బృందం చే పడిని వేలిగింప చేశారు. పూజా కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలో నిజామాబాద్ నుంచి వచ్చిన ఆర్కెస్ట్రా బృందం పాడిన అయ్యస్ప భజన పాటలతో అయ్యప్ప స్వాములు భక్తి పారవశ్యంతో నృత్యాలు చేస్తూ, పేటతుల్లి అడారు. కమిటీ వారు మహా పడి పూజ దాతలకు సన్మానం చేశారు. పడి పూజ మహోత్సవానికి ఎల్లారెడ్డి నూతన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, మున్సిఫ్ కోర్ట్ జడ్జీ గౌండ్ల హారిక, స్థానిక ఆర్డీవో మన్నె ప్రభాకర్ హాజరయ్యారు. వీరికి ఆలయ కమిటీ తరపున కృష్ణారెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. అలాగే శాలువాతో ఘనంగా సత్కరించారు. పడి పూజకు చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతరత్రా మండలాల నుంచి, పిట్లం, నల్లవాగు, బాన్స్ వాడ, నిజాంసాగర్ తదితర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో అయ్యప్ప మాలా ధార స్వాములు హాజరయ్యారు. పూజా అనంతరం స్వాముల కు, శాస్త (అల్పాహారం ) ను సేవాసమితి సభ్యులు స్థానిక మర్వాడీ వ్యాపారి నారాయణ సెట్ , అర్జున్ పురోహిత్, హస్ముక్, సురేష్, ప్రకాష్, పోల్సాని సురేందర్ రావు లు సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమంలో అయ్యప్ప సేవాసమితి కమిటీ గౌరవ అధ్యక్షులు గురు స్వామి ముదిగొండ చంద్రం స్వామి, ప్రధాన కార్యదర్శి ఉక్కల్కర్ రాజేందర్ నాథ్ గురు స్వామి, హమ్మంతప్ప గురుస్వామి, బొందుగుల నాగేశ్వర్ రావు గురు స్వామి, ప్యాలాల రాములు గురు స్వామి, శ్రీనివాస్ గౌడ్ గురు స్వామి, ఓర శ్రీనివాస్ గురు స్వామి, ఓర భీమన్న గురు స్వామి, మురళి గురు స్వామి, ప్రశాంత్ గౌడ్ స్వామి, బొండ్ల సాయులు , తరుణ్ స్వామి, రాజ్ కిరణ్ స్వామి, అన్న శివకుమార్ స్వామి, శ్రీనివాస్ రెడ్డి స్వామి, నరేందర్ స్వామి, నవీన్ స్వామి, కన్నె , కత్తి , గద, గంట, కన్నె మాతా స్వాములు తదితర మాలాధార స్వాములు, భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.