మంచిర్యాల, డిసెంబర్ 12, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల పట్టణంలో బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బీసీ జన గణన చేపట్టాలని, మంగళవారం మంచిర్యాల జిల్లా బిసి సంఘాల ఐక్యవేదిక ఆద్వర్యంలో కోరారు. ఊ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తూ నాయకులు మాట్లాడుతూ 1931 లొ బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన జనగణన తప్ప ఇప్పటివరకు ఏ ప్రభుత్వం బిసి జనగణన చేపట్టిన జరుగలేదన్నారు. జనగణన పట్టికలో 34 కాలమ్స్ ఉన్నాయి కుల గణన చేస్తే అదనంగా ఇంకొక కాలం మాత్రమే చేరుతుందన్నారు. బిసి జనగణన కు కూడా ఖర్చు కాదని, పట్టికలో ఒక కాలం అదనంగా చేర్చడానికి అంగీకరించని కేంద్ర ప్రభుత్వం దేశంలోనే 85 కోట్ల మంది బీసీలను ఎలా అభివృద్ధి చేస్తుందన్నారు. జనగణనలో కుల గణన చేస్తే బిసి లకు విద్యా ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల లో ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్లు పెంచాల్సి వస్తుందని కేంద్ర పాలకులు భావిస్తున్నారు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలనే డిమాండ్ ముందుకు వస్తుందనే భయంతో కేంద్ర ప్రభుత్వం కులాల వారి జనగణనకు వెనకాడుతుందని దేశంలో ఉన్న బీసీ సమాజం భావిస్తుందన్నారు. బీసీ కులాలకు ఇవ్వవలసిన ప్రజాస్వామ్యవాట ఇవ్వకుండా ఎన్ని రోజులు దాటవేస్తారని, స్వతంత్రం వచ్చి 76 ఏళ్లు దాటినా 60 శాతం జనాభా కలిగిన బీసీలకు రిజర్వేషన్ల కేటాయింపులో అన్యాయం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. దేశంలో గుర్తింపు పొందిన 27 రాజకీయ పార్టీలు బిసి జన గణనకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు ఇవ్వడం జరిగిందని, 9 రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ గణనకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన బీసీ గణన చేపట్టడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందన్నారు. ఇప్పటికైనా బీసీల న్యాయమైన డిమాండ్ పరిష్కరించి బీసీల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని డిమాండ్ చేస్తున్నామని, లేనిపక్షంలో బిజెపి ప్రభుత్వం బీసీల అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బిసి ఐక్యవేదిక అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు గజెల్లి వెంకన్న, పట్టణ అధ్యక్షులు బోడంకి మహేష్, జైపాల్ సింగ్, అంకం సతీష్, అరెందుల్ల రాజేశం, ఇన్నారం కిరణ్, బోర శేఖర్, బొప్ప అంజన్న, రాసమల్ల కుమార్, కీర్తి బిక్షపతి, నగునూరి లక్ష్మణ్, ఆడెపు రాజేష్, వేముల కిరణ్, బిసి సంఘ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ జనగణన చేపట్టలని కోటి సంతకాల సేకరణ
38
previous post