ఎల్లారెడ్డి, డిసెంబర్ 12,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండి మాసానిపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న విద్యార్థిని అజ్మీరా.సరోజ, తూప్రాన్ లో జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల పిజి హెచ్ ఎం రాజులు, వ్యాయామ ఉపాధ్యాయుల ఎండి అతికుల్ల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల13 వ తేదీ నుండి కర్ణాటక రాష్ట్రంలోని తుముకురు జిల్లాలో జరిగే జాతీయస్థాయి సబ్ జూనియర్ ఖోఖో (అండర్ 14) పోటీలకు ఎంపికై క్యాంపు నుంచి తుముకురు కు బయలు దేరి వెళ్లినట్లు వ్యాయామ ఉపాధ్యాయులు ఎండి.అతిఖుల్ల తెలిపారు. ఈ సందర్భంగా హెచ్ ఎం రాజులు మాట్లాడుతు ఖమ్మంలో పది రోజులుపాటు జరిగిన నేషనల్ క్యాంపులో పాల్గొని మంచి ప్రదర్శన చూపి ప్రోబేబుల్స్ నుండి మెయిన్ టీమ్ జాతీయస్థాయికి ఎంపికై నందుకు ఉపాద్యాయ బృందానికి చాలా గర్వంగా ఉందన్నారు. ఖో ఖో క్రీడల శిక్షణ ఇచ్చిన వ్యాయమ ఉపాధ్యాయులు అతిఖుల్ల పనితీరును హెచ్ ఎం, ఉపాద్యాయ బృందం ప్రశంసించారు. ఈ ఎంపిక పట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయులుగా అతిఖుల్ల వచ్చిన తక్కువ సమయంలోనే తమ గ్రామ పాఠశాల పిల్లలు జాతీయ స్థాయిలో ఆడడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామస్తులు, క్రీడాభిమానులు సరోజను అభినందించారు. అజ్మీరా సరోజ సోమిర్యాగడి తండాకు చెందినది కావడంతో తాండా సర్పంచ్ లచ్చి నాయక్, ఉప సర్పంచ్ దన్ సింగ్, ఎంపిటిసి దనావత్ లక్ష్మి, తాండా యూత్ అద్యక్షులు రాకేష్ నాయక్ , తాండా వాసులు సరోజ జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైనందుకు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.