మిర్యాలగూడ డిసెంబర్ 11 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తున్న మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి నా చిరు విన్నపం.. శాలువాలు, పూలమాలలు, బొకేలు తీసుకురావద్దని వాటికి చేసే ఖర్చుతో ఒక నోట్ బుక్ తీసుకొని వచ్చి ఇస్తే నేను మరింత సంతోషిస్తానని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) కోరారు. మీరు తెచ్చే నోట్ బుక్ ఒక పేద, మధ్యతరగతి విద్యార్థికి అందజేసిన వారవుతామని దయచేసి ఎవ్వరు అన్యధా భావించకుండా సహకరిస్తారని బిఎల్ఆర్ విన్నవించుకున్నారు.