Home తాజా వార్తలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ 78వ జన్మదిన వేడుకలు

by Telangana Express

మంచిర్యాల, డిసెంబర్ 09, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ, ఎన్ఎస్ యుఐ నాయకుల అధ్వర్యంలో సోనియాగాంధీ78వ జన్మదిన వేడుకలను, జన్నారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. శనివారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ కాంగ్రెస్ నాయకురాలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్ యుఐ నాయకులు ర్యాలీగా బయలుదేరి జన్నారం బస్ స్టేషన్ వద్దకు చేరి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు ఉచిత బస్ ప్రయాణంలోని ప్రయాణికుల అభిప్రాయం తెలుసుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్స్ పంచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలను మహాలక్ష్మి పథకం సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించడం తెలంగాణ ప్రభుత్వానికి మహిళలు బస్సులలో ఉచిత ప్రయాణం చేసేవారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముజఫర్ అలీ ఖాన్, మండల ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, సీనియర్ నాయకులు సయ్యద్ ఇసాక్, మచ్చ శంకరయ్య, సుధాకర్ నాయక్, ఎన్ఎస్ యుఐ రాష్ట్ర కార్యదర్శి సొహెల్ షా, అజ్మత్ ఖాన్, హాడాయి హన్మంతు, కోల పద్మారావు, ఆరే శిరీష్ కుమార్, కంటేం శంకర్, నందు నాయక్, తేకుమట్ల పంకజ లక్ష్మి, సుగుణ, లావణ్య, షాహిన్, లక్ష్మీనారాయణ, రియసత్ అలీ, ఇబ్రహీం, అంబడిపెల్లి నర్సయ్య, పాదం రాకేష్, నాయిని రాయమల్లు గౌడ్, అజార్, మల్యాల బాపన్న, ఆకుల సత్యనారాయణ, బండారి స్వామి, వామన్, యస్ కె ఇమ్రాన్, షకీర్, శంకర్ గౌడ్, మైదం మల్లేష్, రాహుల్ యాదవ్, యమ్ ఎరజాక్, వాసల భాస్కర్, మునేసుల శంకర్, మానిక్ రావు, రవి నాయక్, ఈర్లా గంగన్న, నాయిని రమేష్ గౌడ్, పి శ్రీనివాస్ గౌడ్, చంద్రయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రయాణికులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment