మంచిర్యాల,డిసెంబర్ 07, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని రెండుసార్లు టిఆర్ఎస్ ప్రభుత్వం చేజింక్కుంది. బి ఆర్ ఎస్ మంత్రి వర్గంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరగలేదు. 2023 నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరిగి డిసెంబర్ 3న ఫలితాలు వెలుబడిన నేపథ్యంలో నూతన రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. మూడవ రాష్ట్ర మంత్రివర్గంలో బీసీలకు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు కోరుతున్నారు. బీసీ కులాల నుండి ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్న మన్నారు. బీసీలకు రిజర్వేషన్లు 50 శాతం కల్పించాలని, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు కోరుతూ, రాష్ట్ర మంత్రివర్గంలో ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ప్రకటించాలని, రాష్ట్ర బీసీ సంఘ నాయకులు కోరారు. రాష్ట్రా ఎలక్షన్లలో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క తీరుగా బీసీ కులాల వారికి టిక్కెట్లు ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పాలన కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నారని, బీసీలు పదిమంది వరకు ఎమ్మెల్యేలు గెలిచినారని అందులో నుండి ఐదుగురికి ఒక్కొక్క కులానికి ఒక మంత్రి పదవి చొప్పున ఇచ్చి బీసీ కులాల వారిని ఆదరించాలని కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిసి కులాల ఉద్యమ పోరాటం సంఘం నాయకుడు కోడూరి చంద్రయ్య, బీసీ సంఘ ఉద్యమ పోరాట నాయకులు, కోరారు.
రాష్ట్ర ఏర్పడిన మూడవ మంత్రివర్గంలో బీసీల ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వాలి
39
previous post