Home తాజా వార్తలు ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావుకు ఐటి శాఖ మంత్రయ్యే అవకాశం…?

ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావుకు ఐటి శాఖ మంత్రయ్యే అవకాశం…?

by V.Rajendernath

హైదరాబాద్, డిసెంబర్ 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)తెలంగాణ కొత్తగా ఏర్పాటయ్యే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడే కొత్త మంత్రి వర్గ విస్తరణలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్యెల్యేగా గెలిచిన మదన్ మోహన్ రావుకు ఐటి శాఖ మంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పలు దేశాల్లో ఐటి కంపెనీలు ఉన్న అతనికి ఐటి రంగంలో ఉన్న ప్రావీణ్యతను చూసి టీపీసీసీ ఐటి చైర్మెన్ చేశారు. ఆయన రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. ఈ సన్నిహిత్యమే ఎల్లారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీటును, తీవ్ర పోటీలో సైతం దక్కడానికి కారణం అయ్యింది. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం తీవ్ర వ్యతిరేకం చేసిన ఆయన టికెట్ ను ఆపలేక పోయారు. చివరకు ఆయన్ను ఓడించే కుట్ర జరిగినప్పటికీ, ఆయనకు ఉన్న ప్రజాదరణ ముందు ఏ కుట్రలు పని చేయలేదు. ఐటి రంగంలో ఉన్న నైపుణ్యతను సద్వినియోగం చేసుకుంటూ, ఓ సిస్టం ప్రకారం ఎన్నికల్లో విజయం 86, 276 ఓట్లు సాధించి, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి సురేందర్ పై 23, 621మెజార్టీతో జిల్లాలో మెజార్టీలో సైతం ముందున్నారు. ఒక క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయుని కుమారుడు మదన్ మోహన్ రావు వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేశారు. వృత్తిరీత్యా సాఫ్టువెర్ రంగంలో స్థిరపడి, విదేశాల్లో సాఫ్టువేర్ కంపెనీలు స్థాపించి నేడు ఎమ్యెల్యే అయ్యారు. త్వరంలో మంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

You may also like

Leave a Comment