Home తాజా వార్తలు కామారెడ్డి జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకొనున్న6లక్షల 61,163 మంది ఓటర్లుజిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

కామారెడ్డి జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకొనున్న6లక్షల 61,163 మంది ఓటర్లుజిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్.

by V.Rajendernath

కామారెడ్డి, నవంబర్ 29:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి జిల్లాలో
6లక్షల 61వేల 163 మంది ఓటర్లు ఈ నెల 30న ఓటు హక్కు వినియోగించుకొనున్నట్లు
జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఓ ప్రకటనలో  పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో పురుషుల కంటే  మహిళా ఓటర్లు ఎక్కువ.  కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ , బాన్సువాడ సెగ్మెంట్ లు ఉన్నప్పటికీ, బాన్సువాడ సెగ్మెంట్ నిజామాబాద్ జిల్లా పరిధిలోని లెక్కల్లో ఉంది.  6లక్షల 61వేల 163 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 3 లక్షల 21వేల,104మంది పురుషులు, 3లక్షల 40వేల, 022మంది మహిళలు, 37 మంది ఇతరులు తమ తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కామారెడ్డి సెగ్మెంట్లో 2లక్ష 45,  822 మంది వోటర్లు ఉండగా, 1,18,718 వీరిలో పురుషులు, 1,27,080 మహిళలు, ఇతరులు  24మంది వున్నారు.
ఎల్లారెడ్డిలో 2 లక్షల 20, 531మంది వోటర్లు ఉండగా, పురుషులు 1లక్ష 06, 347, మహిళలు 1లక్ష 14, 182మంది, ఇతరులు ముగ్గురు వున్నారు.
జుక్కల్ నియోజక వర్గంలో 1లక్ష 97వేల, 897ఓట్లరు ఉండగా, వీరిలో 97, 618మంది పురుషులు ఉండగా, 1లక్ష 269మంది మహిళ వోటర్లు, 10మంది ఇతరులు వున్నారు.  జిల్లాలో 791పోలింగ్ కేంద్రాల ఉండగా, 75రూట్లు ఏర్పాటు చేశారు. కామారెడ్డిలో  266పోలింగ్  కేంద్రాలకు 21రూట్లు, ఎల్లారెడ్డిలో 270పోలింగ్ కేంద్రాలకు 29రూట్లు, జుక్కల్ సెగ్మెంట్ లో 255పోలింగ్ కేంద్రాలకు 25రూట్లు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.

You may also like

Leave a Comment