Home తాజా వార్తలు మరోసారి ఆశీర్వదించి గెలిపించండి

మరోసారి ఆశీర్వదించి గెలిపించండి

by Telangana Express

ఘట్కేసర్ పట్టణం రోడ్ షోలో మేడ్చల్ బిఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి

ఘట్కేసర్,నవంబర్29(తెలంగాణ ఎక్స్ ప్రెస్)నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మేడ్చల్ బిఆర్ఎస్ అభ్యర్థి చామకూర మల్లారెడ్డి అన్నారు.
మంగళవారం ఘట్కేసర్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు తన సొంత నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్టు తెలిపారు. మరోసారి ఆశీర్వదించి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మున్సిపల్ బిఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శీనన్న గౌడ్, బిఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment