Home తాజా వార్తలు పోలింగ్ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు నిషేధం. జిల్లాలో 144 సెక్షన్ అమలు. జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్

పోలింగ్ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు నిషేధం. జిల్లాలో 144 సెక్షన్ అమలు. జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్

by V.Rajendernath

కామారెడ్డి, నవంబర్ 28:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పురస్కరించుకుని ఎలక్షన్ కమిషన్ నియమావళిని అనుసరిస్తూ జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నవంబర్ 28 మంగళవారం సాయంత్రం 5:00 గంటల నుండి ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమలులోకి వచ్చిందని, ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో జిల్లా ఎస్పీ సింధు శర్మతో కలిసి జిల్లా కలెక్టర్ అయిన జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ మిఫియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ, 48 గంటల సైలెన్స్ పీరియడ్ దృష్ట్యా జిల్లాయేతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండకూడదని స్పష్టం చేశారు. ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, ఎంసిసి , పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్లు తనిఖీ లు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెక్షన్ 126(1)(బి) ఆర్ పి యాక్ట్ 1951 ప్రకారం ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ నిషేధమని కలెక్టర్ స్పష్టం చేశారు. నవంబర్ 28 సాయంత్రం ఐదు గంటల నుంచి ఎన్నికలు ముగిసే వరకు జిల్లాలో మద్యం షాపులను మూసివేయించి, డ్రై డేగా ప్రకటించినట్లు వెల్లడించారు.

You may also like

Leave a Comment