కామారెడ్డి, నవంబర్ 27:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను గెలిపిస్తే కామారెడ్డి సెగ్మెంట్ లో అవినీతి రహిత పాలన అందిస్తానని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి అన్నారు. సోమవారం కామారెడ్డి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ముదిరాజ్ సదర్ సంఘం భవన్ లో తెలంగాణ మనముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర సంఘం నాయకుడు చింతల నీలకంఠం అధ్యక్షతన జరిగింది. ఈ సమ్మేళనంలో పాల్గొన్న ముదిరాజ్ లు ఈ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఈ సమ్మేళనంలో పాల్గొన్న బిజెపి అభ్యర్థి రమణ రెడ్డి మాట్లాడుతూ, తనకు స్వచ్చందంగా ముందుకు వచ్చి మద్దతు తెలిపిన ముదురాజ్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తను ఈ స్వార్థం లేకుండా ఆలయాలకు , సంఘాలకు తన వంతు సహకారం అంధిస్తునాన్నని, తను గెలిచిన గెలవక పోయిన తన సహాయం మాత్రం అగదన్నారు. ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను న్యాయమైన పాలన అందించడమే తన లక్ష్యం అన్నారు. తను గెలిచాక అవినీతిలో భాగస్వాములన్న అధికారులు ఎవరైనా ఉంటే స్వచ్చందంగా వెళ్లిపోతారని అన్నారు. కామారెడ్డి ప్రజలకు తను ఎప్పుడు అందుబాటులో ఉంటే అన్నారు. అనంతరం బీజేపీ ఫ్లోర్ లీడర్, మున్సిపల్ కౌన్సిలర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ, బీజేపీ అభ్యర్థి కామారెడ్డి లోకల్ అని, బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ గా వచ్చారని, రేపు వాళ్ళు గెలిస్తే మనల్ని గేట్ లోకి కూడా రానివ్వరని అన్నారు. అందుకే స్థానికుడైన రమణారెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, ముదిరాజ్ పెద్దలు, సభ్యులు గోలి వడ్డ శంకర్ చింతల రమేష్ శేఖర్ దాదే బాలరాజ్ పిల్లి మల్లేష్ , బొడ్డు ఆంజనేయులు ,చెన్నం నర్సింలు, సునుగురి భాను , పుట్ట భాస్కర్ , జంగిటి శేఖర్, కనికంటి రాజు, సానబోయిన బాలకృష్ణ , మంద మనోజ్, చింతల అంజయ్య, చింతల శ్రీనివాస్, బట్టు సత్యం, చామంతుల నరసింహులు, జంగిటి రవి, ఆశయ రాజు, కాకర్ల చిన్న శేఖర్ , శంకర్, సుమారు ముదిరాజ్ సంఘ సభ్యులు 500 మంది ల్కుటుంబాలు
బిజెపి పట్టణ అధ్యక్షులు విపుల్ జాయిన్, అవధూతల నరేందర్ హనుమాన్ల సురేష్ ఆకుల భరత్ పాల్గొన్నారు
ఎమ్మెల్యేగా గెలిపిస్తే అవినీతి రహితపాలన అందిస్తాకామారెడ్డి బీజేపీ అభ్యర్థి రమణ రెడ్డి
45
previous post