ఎడపల్లి,నవంబర్ ”26 (తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఎడపల్లి మండలం లో ఆదివారం ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ లు జానకంపేట, నేహ్రునగర్ లో లో ఎమ్మెల్సి కవిత,ఎమ్మెల్యే షకీల్ ఎన్నికల ప్రచారం లో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్
సుదర్శన్ రెడ్డి ఇళ్ళు ఎక్కడ ఉందో తెలుసా, కరోణ గోళి ఇవ్వక ,వేలకోట్ల రూపాయలున్న కానరాని ఆయన ఎన్నికలప్పుడే ప్రచారానికి రావడం సిగ్గుచేటన్నారు. అనంతరం ఎమ్మెల్సీ
కవిత మాట్లాడుతూ
రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే షకీల్ అని, కారు గుర్తు ఓటు వేయాలని,రైతు బంధు, మూడు లక్షల గృహలక్ష్మి , అందిస్తుందన్నారు. కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు నీరు లేదు ,కరెంటు, ఫించన్ 200 వచ్చేవన్నారు అనంతరం జానకంపేట, నేహ్రునగర్ లో కోన్ని సమస్యలైన, ఇళ్ళ స్థలాల సమస్యలను, రేషన్ కార్డులు, కరెంటు ఇస్తామని చెబుతున్నారు. రైతు బంధు ఇచ్చేవాళ్ళు కావాలా,రాబందు పాలన కావాలా, బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు కావాలంటే కారు గుర్తు కు ఓటు వేయాలని అభ్యర్థించారు . అనంతరం మైనారిటీల కోసం బిఆర్ఎస్ వెన్నంటే ఉంటుందని, వారి విద్యా, వైద్యం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కేసీఆర్ హయాంలో హిందూ ముస్లిం సోదరులు కలిసి ఉన్నారని , కావాలంటే ఇట్ కా జవాబు ఓటుతో చెప్పాలని, నా తప్పు లుంటే క్షమించాలన్నారు. ఆటో రిక్షా ఇన్సూరెన్స్ తోలగించారని, కేసీఆర్ పెదల మనిషి, నేహ్రునగర్ గ్రామస్తుల అన్ని సమస్యలకూ పరిష్కారం స్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్,ఇమ్రాన్ లపై , దాడిని ఆమే తీవ్రంగా ఖండించారు.కాంగ్రెస్ ,బిజేపి రెండు పార్టీలు కలిసి దాడులకు పాల్పడ్డుతున్నాయని తేరముందు బిజేపి తో ,తెరవెనుక ద్రోహి కాంగ్రెస్ తో జాగ్రత్తగా ఉండాలన్నారు. , ఈకార్యక్రమంలో వైస్ ఎంపిపి ఇమ్రాన్ ఖాన్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
