సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి.
( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
26 నవంబర్ మద్దూరు:
మద్దూరు మండలం భీంపూర్, పెదిరిపాడ్ గ్రామాల్లో సిపిఎం పార్టీ సమావేశాలు నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటరామిరెడ్డి హాజరై మాట్లాడుతూ దేశంలో మతోన్మాద కార్పొరేట్ కరుణ విధానాల అవలంబిస్తున్న బిజెపిని రాష్ట్రంలో పేదల రైతుల కార్మికుల నిరుద్యోగుల వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వచ్చినట్లయితే రైతు నీ లాభసాటిగా చేస్తామని ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే బ్యాంకింగ్ ఎల్ఐసి వంటి సంస్థలను ప్రైవేటుపరం చేస్తుందన్నారు రైతు వ్యతిరేక విధానాల అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తూ బ్యాంకులకు సెతగోపం పెట్టిందని అన్నారు అందుకే సిపిఎం పార్టీ ఎన్నికల్లో ప్రజావ్యతిరేక విధానాల అవలంబిస్తున్న బిజెపి ఓడించాలన్నారు అదే రకంగా రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగిస్తున్న కేసీఆర్ పరిపాలనను సాగనంపాలని అన్నారు. సిపిఎం జిల్లా నాయకులు అంజీలయ్య గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, బిజెపిలను ఓడించాలని అన్నారు. కేసిఆర్ ఇచ్చిన హామీలను డబుల్ బెడ్రూం, రైతు రుణమాఫీ వంటి హామీలను విస్మరించిన పాలకులను ఒడించలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నాయకులు బింపుర్ హన్మంతు, అశోక్, మహ్మద్ అలీ, వెంకటప్ప, శ్రీనివాస్, వెంకట్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
బీజేపి,బీ అర్ ఎస్ పార్టీలను ఒడించండి
57
previous post