బీఆర్ఎస్ అభ్యర్థి సతీష్ కుమార్ అల్లుడు డా. అనురాగ్
హుస్నాబాద్ రూరల్ నవంబర్ 26
( తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
హుస్నాబాద్ మండలం పొట్లపల్లి, పందిళ్ళ, మహమ్మదాపూర్, గోవర్ధనగిరి, గౌరవెల్లి, అంతక పేట గ్రామాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ కుమార్ కు మద్దతుగా ఆయన అల్లుడు డా. అనురాగ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో గ్రామ, గ్రామానికి బీటీ రోడ్లు, సిసి రోడ్లు, గ్రామపంచాయతీ భవనాలు, వివిధ సామాజిక భవనాలు, పాఠశాలలు, త్రాగునీరు, సాగునీరు అలాగే హుస్నాబాద్ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా సతీష్ కుమార్ అభివృద్ధి చేశారని ఈనెల 30న జరిగే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి హుస్నాబాద్ ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ ను మూడవసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.