Home తాజా వార్తలు నిరుద్యోగులు ఆలోచించండి

నిరుద్యోగులు ఆలోచించండి

by Telangana Express

విద్యార్థి నిరుయోధ్యగ సమావేశం

మంచిర్యాల, నవంబర్ 26, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఎన్ఎస్ యుఐ రాష్ట్ర కార్యదర్శి సొహైల్ షా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎన్ఎస్ యుఐ జాతీయ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ విద్యార్థులు ఆలోచించండని, విద్యార్థి నిరుద్యోగిత హామీ ఎటుపోయిందని, పరిపాలనలో ఉన్న నాయకులను నిలదీయండన్నారు. జన్నారంలో ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థి నిరుయోధ్యగ సమావేశంలో ఖానాపుర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎడమ బొజ్జు పటేల్ కు ఎన్ఎస్ యుఐ జాతీయ అధ్యక్షులు నీరజ్ కుందన్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వెంకట్ బల్మూరి మద్దతుగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. మోడీ కేసీఆర్ ఇద్దరు దోచుకునే తోడు దొంగలే జ్యోష్యం పలికారు. దేశంలో, రాష్ట్రంలో సామాన్యులు, పేదలు, చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని రానున్న నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే ఓటు వేసి ఖానాపూర్ నియోజకవర్గ వేడ్మా బొజ్జు పటేల్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను నిరుద్యోగులను కోరారు. ఈ సమావేశంలో ఎన్ఎస్ యుఐ జాతీయ రాష్ట్ర విద్యార్థి నిరుద్యోగ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment