లోకేశ్వరం తెలంగాణ ఎక్స్ ప్రెస్ నవంబర్ 26
ఎన్నికల ప్రచారంలో భాగంగా లోకేశ్వరం మండల కేంద్రంలో, గడప గడపకు బీజేపీ ప్రచారం నిర్వహించిన పవార్ రామారావు పటేల్ ని గెలిపించలనీ ప్రజలు తెలియజేశారు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఆయుష్మాన్ భారత్, చిరు వ్యాపారులకు ఆర్థిక సహాయం అందించడానికి బీజేపీ కృషి చేసిందని ,ఎన్నో పథకాలను అందిస్తున్నది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని అన్నారు
బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వకున్నా ఇన్ని విధాలుగా మీకు అండగా నిలుస్తూ వచ్చింది, ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి ఇంకెన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తుందని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తాము ఇస్తున్నామని చెప్పుకుంటున్న డబల్ బెడ్ రూమ్ పథకం కూడా ప్రధాన్ మంత్రి గ్రామీన్ ఆవాస్ యోజనలో భాగమే అని అన్నారు. సొమ్ము కేంద్రానిది సోకు రాష్ట్ర ప్రభుత్వానిది అన్నట్టుగా బి ఆర్ ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా కోట్ల గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చింది కూడా బిజెపి నే అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో జయసాగర్ రావు మేండే శ్రీధర్, చిన్నారావు, సర్పంచులు మంద భాస్కర్, సాయన్న,సంజీవ్ రెడ్డి,సాయన్న,సరస్వతి, పలు గ్రామాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.