మల్లారెడ్డిని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు…
మేడ్చల్ గడ్డమీద ఎగిరేది బీజేపీ జెండానే…
ఘట్కేసర్,నవంబర్26(తెలంగాణ ఎక్స్ ప్రెస్)కేసిఆర్ కుటుంబ పాలనను సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటు రోజు రోజుకు ప్రజల నుండి బీజేపీ పార్టీకి మద్దతు పెరుగుతుందని, దీనితో బిఆర్ఎస్ పార్టీని ఇంటికి వంపడం ఖాయమని బీజేపీ యువ నాయకుడు పోలు భాస్కర్ గౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల్ ఎదులాబాద్ గ్రామంలో గడప గడపకు వెల్లి బీజేపీ హామీలను ప్రజలకు వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మన స్థానికుడు ఏనుగు సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని వేడుకున్నాడు.
ఈ సందర్భంగా భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్ళిన ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కేసిఆర్ కుటుంబ పాలనకు ముగింపు పడనుందని, ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వ విధానలతో ప్రజలు పూర్తిగా విసుగు చెందిపోయారని, ప్రత్యామ్నాయ దిశగా ప్రజలు తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ బీజేపీ ని తీసుకు రావడం వైపు చూస్తున్నారని అన్నారు.
ప్రచారంలో బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్రోళ్ల కుమారస్వామి,నాగరాజు, నరేందర్ రెడ్డి, రాములు,హరి క్రిష్ణ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.