Home తాజా వార్తలు 384 మద్యం బాటిళ్ల పట్టివేత…తరలిస్తున్న టాటా మేజిక్ ఆటో సీజ్…కేసు నమోదు…వ్యక్తి అరెస్టు..- ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ షాఖీర్ అహ్మద్

384 మద్యం బాటిళ్ల పట్టివేత…తరలిస్తున్న టాటా మేజిక్ ఆటో సీజ్…కేసు నమోదు…వ్యక్తి అరెస్టు..- ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ షాఖీర్ అహ్మద్

by V.Rajendernath

ఎల్లారెడ్డి, నవంబర్ 21,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీలో భాగంగా, సోమవారం రాత్రి 10.30 గంటలకు ఎల్లారెడ్డి ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గాంధారి మండల కేంద్రం నుంచి చద్మల్ వైపు వెళుతున్న టాటా మేజిక్ ఆటో ను తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 384 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ ఎండి షాఖీర్ అహ్మద్ తెలిపారు. మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం వద్ద పట్టుకున్న, ఆటోను, స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు విలేఖరుల ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం రవాణ కాకుండా ఎల్లారెడ్డి ఎక్సైజ్ సిబ్బంది చే వాహనాల తనిఖీలు ముమ్మరం చేశామని, సోమవారం రాత్రి గాంధారి నుంచి చధ్మల్ వైపు వెళుతున్న టాటా మేజిక్ ఆటో నం టి ఎస్ 16 యుసి 2055 ను పట్టుకుని తనిఖీ చేయగా 8 మద్యం బాక్సుల ను తనిఖీ చేయగా 384 రాయల్ చాలెంజ్ (180 ఎం ఎల్ ) మధ్యం బాటిళ్లు గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే ఆటో ను సీజ్ చేసి కేసు నమోదు చేసి , మద్యం తరలిస్తున్న నేరెల్ తాండా కు చెందిన కటేరియ రమేష్ ను అరెస్టు చేయడం జరిగింద న్నారు. పట్టుకున్న మద్యం బాటిళ్లు ,ఆటోతో కలిపి సుమారు 4,76,032 రూపాయల విలువ అని ఎక్సైజ్ సీఐ తెలిపారు. వాహనాల తనిఖీలు ఎల్లారెడ్డి ఎక్సైజ్ ఎస్ఐ ఎండి. జలీలొద్దిన్, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ కె భూపాల్, కానిస్టేబుల్స్ రవీందర్ రెడ్డి, సంజీవ్ గౌడ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment