Home తాజా వార్తలు అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు

అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు

by V.Rajendernath


బోధన్ రూరల్, నవంబర్ 21:(తెలంగాణ ఎక్ష్ప్రెస్స్)
అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న ఎకైక సిఎం కేసిఆర్ అని జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్ అన్నారు.బోధన్,సా లూరా మండలంలోని హంగార్గ,కొప్పర్గ,
చిన్న మావంది, పెద్ద మావంది, బండారు పల్లి,హున్సా, ఖాజా పూర్, మందార్న,సాలురా,
సిద్దపూర్, ఖండ్ గావ్, బిక్నెల్లి, కల్దుర్కి గ్రామాలలో బోధన్ బిఆర్ ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సిఎం కేసిఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి,పార్టీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించారు.గత పాలకుల 50 సంవత్సరాల పాలనలో జరగని అభివృద్ధి కేవలం 10 సంవత్సరాల బి ఆర్ఎస్ పాలనలో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఏకైక సీఎం కెసిఆర్ అని పేర్కొన్నారు.అభివృద్ధి,సంక్షేమ పథకాలు అందించిన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించి బోధన్ ఎమ్మెల్యేగా షకీల్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గీర్దావర్ గంగారెడ్డి,శరత్, ఎంపీపీ బుద్దే సావిత్రి రాజేశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ వీఆర్ దేశాయ్, వైస్ చైర్మన్ షకీల్, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment