Home తాజా వార్తలు స్థానికుడైన నన్ను గెలిపించండిబిఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే

స్థానికుడైన నన్ను గెలిపించండిబిఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్ షిండే

by V.Rajendernath

నిజాంసాగర్ నవంబర్ 21,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):

జుక్కల్ నియోజకవర్గం డోన్ గాం గ్రామానికి చెందిన స్థానికుడైన నన్ను గెలిపించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హన్మంత్ షిండే ఓటర్లను విజ్ఞప్తి చేశారు. మంగళవారం నిజాంసాగర్ మండలంలోని మల్లూర్,ఓడ్డే పల్లి,మాగి,బంజపల్లి,సుల్తాన్ నగర్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి అభ్యర్థి అరుణతార నిజామాబాద్ కు చెందిన వారని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట లక్ష్మీకాంతరావు సంగారెడ్డి చెందిన వారిని తెలిపారు. నేను జుక్కల్ నియోజకవర్గం మీ బిడ్డను నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు చాలా చేశారని బిఆర్ఎస్ పార్టీకి ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యటన కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బంజపల్లి సుల్తాన్ నగర్ గ్రామాల ప్రజలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. అన్నపూర్ణ పథకం కింద తెల్ల రేషన్ కార్డ్ దారులు అందరికీ సన్న బియ్యం అందజేస్తామన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద మహిళలందరికీ మూడు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు.రేషన్ కార్డుకు కలిగిన కుటుంబాలకు కేసిఆర్ బీమా ఐదు లక్షల రూపాయలు సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి జిల్లాల జడ్పీ మాజీ చైర్మన్,బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దపేదర్ రాజు,ఎంపీ బిబిపాటిల్,
బిఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు పట్లోల్ల దుర్గారెడ్డి,సిడిసి చైర్మన్ గంగారెడ్డి ,వైస్ ఎంపీపీ మనోహర్,సింగల్ విండో చైర్మన్ లు నర్సింహారెడ్డి, వాజిద్ అలీ,ఒంటరి కళ్యాణి విఠల్ రెడ్డి, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, సర్పంచ్ లు అంజయ్య,ఖాసీం సాబ్, అమినాబి, మండల రైతు బంధు అధ్యక్షులు మహేందర్ కుమార్, నాయకులు యాటకారి నారాయణ, ఆనంద్ కుమార్, చాకలి రమేష్ కుమార్, పిట్ల సత్యనారాయణ, బంగ్లా ప్రవీణ్, సందీప్ కుమార్ అహ్మద్ హుస్సేన్, మేకల విజయ్ తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment