బోధన్ రూరల్, నవంబర్ 21: (తెలంగాణ ఎక్స్ప్రెస్)
బోధన్ లో బిజెపి జెండా ఎగురవేస్తామని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బోధన్ పట్టణంలోని రమాకాంత్ ఫంక్షన్ హాల్లో జరిగిన యువబేరీ సంకల్ప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిజామాబాదులో 500 పడకల ఆసుపత్రి ని బీడీ కార్మికుల కోసం ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చమన్నారు. బిజెపి అధికారంలోకి రాగానే ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామన్నారు. బోధన్ బిజెపి అభ్యర్థి మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ పాటి ప్రకాష్ రెడ్డి, అడ్లూరి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, నరసింహారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ కూరెళ్ళ శ్రీధర్, బాలరాజు, ఇంద్రకరణ్, మనోహర్ ,గోనె ప్రవీణ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోధన్ లో బిజెపి జెండా ఎగురవేస్తాం
44
previous post