30
ఎల్లారెడ్డి, నవంబర్ 21:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)సీఈఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్ ను గుర్తించి ఫిర్యాదు దారునికి అందజేసినట్లు ఎస్ఐ గణేష్ తెలిపారు.మంగళవారం ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ, ఎల్లారెడ్డికి చెందిన మైలారం బాల్ రాజ్ మొబైల్ ఫోన్ శివనగర్ లో పోయిందని ఫిర్యాదు చేయడంతో, సీఈఐఆర్ పోర్టల్ ద్వారా గుర్తించి ఫిర్యాదుదారునికి పిలిచి అప్పగించామన్నారు.