హైదరాబాద్, నవంబర్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి-ఎల్లారెడ్డి రెండు అసెంబ్లీ నియోజక వర్గాలకు ఎమ్యెల్యే భావించి రెండు నియోజక వర్గాలను ఊహించని రీతిలో అభివృద్ధి చేస్తా అని కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి, సీఎం.కేసీఆర్ అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీసాయి వెంచర్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో సాయంత్రం 3.30నిముషాలకు ప్రసంగిస్తూ, తాను కామారెడ్డి నుండి పోటీ చేస్తున్న అంటే ఈ ప్రాంతాల అభివృద్ధి కోసమే అన్నారు. తనను కామారెడ్డి నుండి, ఎల్లారెడ్డి నుండి సురేందర్ ను గెలిపిస్తే, రెండు అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎవ్వరు ఊహించని రీతిలో అభివృద్ధి సాధిస్తాయన్నారు. రైతు బంధు వృధా అని ప్రతిపక్షాలు విమర్షిస్తున్నాయని అన్నారు. ఈ పథకం రైతు సంక్షేమం కోసం పెట్టడం జరిగిందని, బీఆర్ ఎస్ అధికారంలో వస్తే ఎకరాకు 16వేలు రైతు బంధు ఇష్టం అన్నారు. రైతు బంధు డబ్బులు మీ ఖాతాల్లో రాగానే సెల్ ఫోన్ లో మెసేజ్ లు వస్తాయని, దీంతో రైతులకు మేలు జరిగిందన్నారు. ఈ రోజు రైతులకు తెలంగాణ రాష్ట్రంలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో సైతం 25లక్షలకు ఎకరాకు భూమిని రైతులు అమ్ముతున్నారన్నారు. నాకు భూమి ఉంది నేను వ్యయవసాయదారున్ని అన్నారు. రైతు కష్టం తెలిసిన నాయకుని, రైతుని అన్నారు. 3గంటల కరెంట్ చాలు అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారన్నారు. 24గంటల కరెంట్ మేము ఇస్తుంటే, కర్ణాటక మంత్రి వచ్చి, కాంగ్రెస్ అధికారంలో వస్తే5గంటల కరెంట్ ఇష్టం అంటే, నవ్వక ఎమ్ చేస్తాం అన్నారు. రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క కాంగ్రెస్ సర్కార్ వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తాం అని రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క అంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలన వస్తే మళ్ళీ పాత పద్ధతులు వచ్చి, పైరవికారుల రాజ్యం వస్తుందన్నారు. రైతులు బతుకాలంటే 24గంటల కరెంట్, రైతు బంధు ఉండాలన్నారు. వెయ్యి రూపాయల ఫించన్ నుండి రాబోయే రోజుల్లో 5వేలు వస్తాయన్నారు. చిన్నతనంలో బీడీ కార్మికుల ఇండ్లలో ఉండి చదువుకున్న, బీడీ కార్మికుల కష్టాలు తెలిసిన వాన్ని, వారికి పెన్షన్ పెంచుతాం అన్నారు. ప్రయివేట్ ఆసుపత్రుల దోపిడీని ఆరికట్టి సర్కార్ ఆసుపత్రుల అభివృద్ధి చేసాము అన్నారు. 3కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించి, 60లక్షల మందికి అద్దాలు ఇచ్చాము అన్నారు. విద్యాభివృద్ధికి గురుకులాలు స్థాపించాం అన్నారు. ఓటు వేసేముందు రాష్ట్ర అభివృద్ధి చేసె వారిని గుర్తించి ఓటెయ్యండన్నారు. తాను గెలిచిన రెండెళ్లలో రెండు నియోజిక వర్గాల్లో నీరుపారని భూమి అంటూ లేకుండా చూస్తాం అన్నారు. పొడు భూముల సమస్య పరిష్కరించాం. తాండాలను జీపీలు చేసాము అన్నారు. సురేందర్ తెలంగాణ ఉద్యమం కారుడని, మంచి వ్యక్తి అని, వ్యక్తి స్వభావం బట్టి కూడా సురేందర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సురేందర్ గెలిస్తే రైతు బంధు, 24గంటల కరెంట్ ఎటు పొదన్నారు. కేసీఆర్ దాదాపు 45నిముషాల పాటు ప్రసంగించారు.
ఈ సభలో జహీరాబాద్ ఎంపీ. బీబీ.పాటిల్ , మాజీ స్పీకర్ మధుసూదన చారీ, ఎమ్యెల్యే అభ్యర్థి సురేందర్, మాజీ మంత్రి నెరేళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్యెల్యే జనార్దన్ గౌడ్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంత రాంమోహన్, జిల్లా పరిషత్ చైర్మన్ దఫెదర్ రాజు, మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు, దాదాపు 25వేలపైగా బీఆర్ ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు హాజరయ్యారు.