Home తాజా వార్తలు కాంగ్రెస్ హస్తం- పేదల నేస్తం అంటూ..”బిఎల్అర్” తనయుల ప్రచారం.. పూరిలు వేస్తూ.. కటింగ్ చేస్తూ జనంతో మమేకం…

కాంగ్రెస్ హస్తం- పేదల నేస్తం అంటూ..”బిఎల్అర్” తనయుల ప్రచారం.. పూరిలు వేస్తూ.. కటింగ్ చేస్తూ జనంతో మమేకం…

by Telangana Express

మిర్యాలగూడ నవంబర్ 15 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ రుణం తీర్చుకునేందుకు.. మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) ను హస్తం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బి ఎల్ ఆర్ తనయులు సాయి ప్రసన్న కుమార్, సాయి ఈశ్వర్ గణేష్ కుమార్ లు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, పెద్ద సంఖ్యలో బుధవారం నుంచి మిర్యాలగూడ పట్టణంలోని పలు వార్డులలో విస్తృత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ స్కీమ్ ల కరపత్రాన్ని ప్రతి ఓటరుకు అందజేసి, హస్తం గుర్తుకు ఓటేసి బిఎల్ఆర్ కు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. సాయి ప్రసన్న కుమార్ రైస్ మిల్లుల వద్ద ప్రచారం నిర్వహించగా, సాయి ఈశ్వర్ గణేష్ కుమార్ హౌసింగ్ బోర్డు నుంచి రాజీవ్ చౌక్, సాగర్ రోడ్డు కు ఇరువైపులా ఉన్న వ్యాపారస్తుల వద్దకు నేరుగా వెళ్లి బిఎల్అర్ హస్తం గుర్తుకు ఓటు వేయవలసిందిగా అభ్యర్థించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, యువ వికాసం, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు పథకాలను పకడ్బందీగా అమలు చేస్తుందని కాంగ్రెస్ హస్తం పేదల నేస్తం అని తమ ప్రచారంలో వారు పేర్కొంటూ..

ప్రచారం నిర్వహించారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా టిఫిన్ సెంటర్లో కొద్దిసేపు పూరిలను వేశారు. సెలూన్ షాప్ లోకి వెళ్లి కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ గణేష్ కుమార్ మాట్లాడుతూ మేము సైతం కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చామని, పేదల కష్టాలు మాకు తెలుసుఅని, పేదల కష్టాలు తీర్చేందుకే


బిఎల్ఆర్ హస్తం గుర్తుకు ఓటెయ్యాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు దేశిడి శేఖర్ రెడ్డి గంధం రామకృష్ణ మంత్రాల రుణాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు మేకల శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, గుంజ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అజరుద్దీన్, ఎర్రెట్ల వెంకటరెడ్డి, అశోక రాథోడ్, భార్గవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment